This is current progress happening in April 2025 with the latest updates of the support & dedication of all the sanga leaders who are constantly thriving and supporting the facility in their marvouls way to shape up the Temple
Working all the time, to ensure Devanga sangham is supported and progressive
Currently the Old Age Home Foundation has been laid and the progress is going on full swing with all the due diligence
ఇవి చౌడేశ్వరి అమ్మ వారి దేవాలయం నకు సంబంధించి జరుగు చున్న పనుల తాలూకు ఫొటోస్,
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లే అవుట్ లో తెలంగాణా ప్రభుత్వం మన తెలంగాణ దేవాంగ సంక్షేమ సంఘానికి 3,600 గజాల భూమి ఇచ్చింది. ఈ స్థలంలో ముందుగా శ్రీ రామ లింగేశ్వర చౌడేశ్వరి అమ్మవారి ఆలయం, వృద్ధాశ్రమం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.. ఇప్పటికే మన దగ్గర ఉన్న నిధులతో కరెంటు, బోర్ వెల్ మన సైట్ లో వేయించుకున్నాం. గ్రౌండ్ లెవెల్ పనులు సాగుతున్నాయి. అమ్మవారి ఆలయ నిర్మాణంతోపాటు వృద్ధాశ్రమం పనులు ఏకకాలంలో సాగించాలని మన భవన నిర్మాణ కమిటీ సంకల్పం. తదుపరి తెలంగాణా దేవాంగ సంక్షేమ సంఘం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కల్యాణ మండపం నిర్మాణ పనులు మొదలు పెట్టాలని.. ఆ దిశగా కమిటీ అడుగులు వేస్తుంది.
మన హైదరాబాద్ లో చౌడేశ్వరి అమ్మవారి ఆలయం లేదు. అందుకని అందరికి అందుబాటులోకి తేవాలని సంకల్పించాం. 52/26పొడుగు, వెడల్పు స్థలంలో నిర్మాణం జరుగుతున్నాయి
శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంతోపాటు శివాలయం, విఘ్నేశ్వర ఆలయం నిర్మించడం జరుగుతుంది. సువిశాల ప్రాంగణంలో భక్తులు పూజలు, వ్రతాలూ చేసుకునే సదుపాయాలు కల్పించబోతున్నాం.
తొందరలోనే నిర్మించబోతున్న ఆలయానికి సంబందించి అమ్మవారు, శివుడు, వినాయక విగ్రహాలకు విరాళం ప్రకటించారు దాతలు. అయితే ఆలయంలో శివుడు, వినాయకుడు, అమ్మ వారివి ఉత్సవ మూర్తులు ,ఫ్లోరింగ్, లైటింగ్, పెయింటింగ్ , ధ్వజస్థంభం ఇతర పూజా సామాగ్రి, 50 మంది కూర్చోడానికి కుర్చీలు అవసరం వుంది. ఇక అమ్మవారి, అయ్యవార్ల గుడుల్లో పానపట్టం, అలంకరణ సామాగ్రికి విరాళాలు ఇవ్వమని కమిటీ కోరుతుంది.దాతల పేర్లు ఆలయ ప్రాంగణంలో లిఖించబడతాయి.
హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్టించబడుతున్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి తొలి ఆలయం ఇది. కావున మన కులబంధువులు అందరు, ఎవరికీ తోచిన విధంగా వారు ధన, వస్తు రూపేణా విరాళం ఇవ్వాల్సిందిగా ఆలయ నిర్మాణ కమిటీ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంది.
వృద్ధాశ్రమం నిర్మాణానికి గాను శ్రీ దొంతంశెట్టి మనోహర్ గారు, వారి సోదరిమణి వేణి రావు గారి ఫౌండేషన్ ముందుకు వచ్చి.. ఆర్థికంగా ముందుకు నడిపిస్తుంది. అయితే అమ్మవారి ఆలయం, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కల్యాణమండపం నిర్మాణం కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. 18కోట్లు ఖర్చు అంచనా వేసింది భవన నిర్మాణ కమిటీ.
తెలంగాణా దేవాంగ సంక్షేమ సంఘం, హైదరాబాద్ దేవాంగ సంక్షేమ సంఘం విరాళం కోసం మిమ్మల్ని అభ్యర్థిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల దేవాంగులతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న మన బంధుమిత్రుల సహాయ సహకారాలు కోరుతుంది..
హైదరాబాద్ లో నిర్మాణం అవుతున్న ఆత్మగౌరవ భవనం మనకు, భవిష్యత్ తరాలకు ఆలంబనగా నిలుస్తుంది.
భవన నిర్మాణ కమిటీ ఆధ్వర్యాన సాగే కార్యక్రమంలో.. ముందుగా హైదరాబాద్ నుంచి విరాళాల సేకరణ మొదలుపెడుతున్నాం.. తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్.. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు విరాళాల సేకరణ కోసం భవన నిర్మాణ కమిటీ సిద్ధంగా వుంది. కావున ఆయా ప్రాంతాల దేవాంగ సోదర, సోదరీమణులు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
దాతలు ధన,వస్తురూపేణా ఇచ్చే బూరి విరాళంతోనే మన సంకల్పం నెరవేరుతుంది. ఇది మనందరిది. రండి చేయి చేయి కలుపుదాం.
Account Number: 5359814993
IFSC CODE : CBIN0280808
CENTRAL BANK OF INDIA Hyderabad Branch
జై దేవాంగ!! జై జై దేవాంగ!!!,
ఆలయ, భవన నిర్మాణ కమిటీ,
తెలంగాణా ఆత్మగౌరవ భవన బిల్డింగ్ కమిటీ,
ఉప్పల్ భగాయత్ లే అవుట్,
హైదరాబాద్*
Dated: 10-02-2024
సమస్త దేవాంగ,కుల భాంధవ్యు లకు, తెలంగాణ దేవాంగ సంక్షేమసంగం, హైదరాబాద్, పాలక వర్గం వారు, హృదయ పూర్వక నమస్కారములు తెలియ చేస్తూ విన్న వించు కొను వివరం ఏమనగా, ప్రస్తుతం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిచే మన దేవాంగ కులస్తులకు సంక్ర మించిన ఉప్పల్ బాగాయత్ స్థలములో, వృద్ధాశ్రమం మరియు దేవాలయ ఫౌండేషన్ పనులు మీ అందరి సహాయ సహకారములతో జరుగుచున్నవి. అందలి దేవాలయం నకు సంబంధించి మన ఈ సంగం వద్ద గల నిధులు పూర్తిగా ఖర్చయి పోయినవి, అనే విషయం మీ దృష్టికి తీసుకొని వస్తూ, తదుపరి నిర్మా నమునకు శ్రీ చౌడేశ్వరి అమ్మ వారి ఆలయం కొరకు, ప్రస్తుతానికి, భూరి విరాళములు అందచేశి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని, అసిస్తూఉన్నది, ఈనిర్మిస్తున్న ఆలయం మన అందరిది, మనమందరం ఇందులో భగస్వాములం.అన్న విషయం మీకు మరియొక సారి తెలియ చేస్తూ ఉన్నది, మన ఈ తెలంగాణ దేవాంగ సంక్షేమ సంఘం,హైదరాబాద్.
వృద్ధాశ్రమంకొరకు,శ్రీ దొంతం శెట్టి వెంకట మనోహర్ గారి, తల్లీ తండ్రులు పేరున గల , శ్రీ వేణి రావు ఫౌండేషన్ ద్వారా మన ఈ సంఘం నకు ఇచ్చిన భూరి విరాళం ద్వారా వచ్చిన ఫండ్స్ తో, ప్రస్తుత వృద్ధాశ్రమం పనులు జరుగుచున్న విషయం మన యావత్ దేవాంగులకు తెలియ చేయుట మా తక్షణ కర్తవ్యం గా భావిస్తూ మీ అందరి దృష్టికి తీసుకొని రావటం జరిగినది. అట్టి వారి, స్వర్గీయ శ్రీ దొంతం శెట్టి అప్పారావు గారి దంపతుల యావత్ సంతనానికి, ఆ చోడేశ్వరి అమ్మవారు, అస్ట్ ఐశ్వర్యలు, ఆయురా రో గ్య లు, అఖండ కీర్తి ప్రతిష్టలు కలుగ చేయాలని, వారు, మన ఈ సంగమ్ నకు ప్రకటించిన మూడు కోట్ల రూపాయలవిరాళమునకు, బదులుగా, వారికి అంతకు వంద రేట్లు ఆదాయం మన ఈ అమ్మవారు కలుగ చేస్తుంది అని మన ఈ సంగం కోరుకొంటూ ఉంది అని వినమ్రం గా తెలియచేసు కొంటూ ఉంది మన ఈ సంగం. జై చౌడేశ్వరి, జై జై చౌడేశ్వరి.